కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాంతార-చాప్టర్-1’. అక్టోబర్-2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హాజరయ్యారు.