JN: పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బైరు అరుణ పాలకుర్తి గ్రామ పంచాయతీ సిబ్బందికి నేడు చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు చీరలను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పరిశుభ్రత కోసం పాటుపడే వారికి పండుగ కానుకగా పంపిణీ చేశామన్నారు.