MNCL: సద్దుల బతుకమ్మ పండుగను ప్రశాంతంగా జరిగేలా చూడాలని జన్నారం పోలీసులకు హిందూ ఉత్సవ సమితి జన్నారం మండల నాయకులు కోరారు. ఈ మేరకు వారు ఆదివారం జన్నారం పోలీస్ స్టేషన్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రత్యేకమని, చివరి రోజు నిర్వహించే సద్దుల బతుకమ్మను ప్రశాంత ఆహ్లాద వాతావరణంలో జరిగేలా చూడాలని వారు కోరారు.