కృష్ణా: కోడూరు మండలం మాచవరంలో తెలుగు యువత మండల అధ్యక్షులు కూరాకుల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంవీ కృష్ణారావు నూతన చిత్రపటాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆవిష్కరించగా గ్రామ కూటమి నాయకులు నివాళులర్పించారు. కూరాకుల శివప్రసాద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రదానం చేశారు.