GNTR: పొన్నూరు పట్టణంలోని 26వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఉల్లంగుంట్ల వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆదివారం ఉల్లంగుంట్ల స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.