NLR: జిల్లాలో బంగారం పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. తవ్వకాల్లో బంగారం బయటపడిందని, తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసి ముఠాలు ఉడాయిస్తున్నాయి. స్టోన్ హౌస్ పేటకు చెందిన వ్యక్తి కర్ణాటకలో బంగారం ఉందని నమ్మి వెళ్లగా, నకిలీ పోలీసుల చేతిలో రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడు. బంగారం ధరలు పెరగడంతో మోసగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు.