NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్సవం హోటల్‌ను ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత స్వశక్తితో ఎదగడానికి ముందుకు రావాలని సూచించారు. అనంతరం మదర్ డెయిరీ డైరెక్టర్‌గా విజయం సాధించిన కర్నాటి జయశ్రీకి అభినందనలు తెలిపారు.