అన్నమయ్య: మదనపల్లె నందు ఇవాళ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం వారి జీవితానికే కాకుండా కుటుంబానికి కూడా రక్షణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.