ప్రకాశం: కనిగిరిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్ 118వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సీపీఐ జిల్లా నాయకులు వై రవీంద్రబాబు పాల్గొన్నారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ రాజ్ గురు, సుఖదేవులతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడారని తెలిపారు.