TG: వరదలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.