ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌తో పాటు పలు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంతో పాటు ఆయా పాఠశాలల్లో బాంబ్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు. అయితే ఎటువంటి పేలుడు పదార్దాలు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.