అన్నమయ్య: రైల్వేకోడూరులో ఆదివారం మధ్యాహ్నం పాత బజారులోని గంగమ్మ తల్లిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు గంగమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ బూత్ కమిటీ సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.