VZM: వైసీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ యాప్ గోడపత్రికను మాజీ ఎమ్మెల్యే బొత్స విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. అధికారులైన నాయకులైన ఎవరైనా చర్యలు తప్పవన్నారు.