GNTR: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీకి ఆదివారం రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 15 అడుగులకు చేరగా, అన్ని గేట్ల ద్వారా 5.67 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.