సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో అధిష్ఠానం సస్పెండ్ చేసింది. నల్లచెరువు మండలానికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, సమివుల్లాను సస్పెండ్ చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది.