HYD: అంబర్ పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ఆదివారం ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇటీవల హైడ్రా అధికారులు మొత్తం మట్టితో పేరుకుపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.7 కోట్లతో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో బతుకమ్మ కుంట వల్ల ముంపు సమస్యలు తగ్గాయని స్థానికులు చెప్పారు.