ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోను పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘గుడ్ బై’.. రష్మిక బాలీవుడ్ ఆశలను ఆవిరి చేసింది. అందుకే ఆ సమయంలో వెకేషన్‌కి చెక్కేసింది ఈ అమ్మడు. అయితే ఎలాగైనా సరే బాలీవుడ్లో జెండా పాతలని చూస్తోంది రష్మిక.
ప్రజెంట్ సందీప్ వంగ డైరక్షన్లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ సరసన నటిస్తోంది. హిందీలో ఈ సినిమా తనకు కలిసొస్తుందని గట్టిగా నమ్ముంతోంది. అయితే యానిమల్ థియేటర్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ లోపే మరో సినిమాతో లక్ చెక్ చేసుకోవాలని చూస్తోంది. అది కూడా బాలీవుడ్లో ఫస్ట్ సైన్ చేసిన మూవీ కావడంతో..
ఆశలు భారీగానే పెట్టుకుంది. ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిచింది రష్మిక. శంతను బాగ్చీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రష్మిక మొదట సైన్ చేసినా సినిమా ఇదే అయినా.. పలు కారణాల వల్ల లేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తుస్తున్నాయి. అందుకే రిస్క్ లేకుడా ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదే జరిగితే ఓటిటిలో సినిమా హిట్ అయినా.. అమ్మడికి పెద్దగా గుర్తింపు రాదు. అందుకే ‘మిషన్ మజ్ను’ అమ్మడికి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.