ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు సీన్ రివర్స్ అయిపోయింది.
టీజర్ చూసాక ఇది యానిమేటెడ్ మూవీ అని తేల్చేశారు అభిమానులు. అందుకే ఆదిపురుష్‌ను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశారు. ఆదిపురుష్ ఔట్ పుట్ అనుకున్నంత స్థాయిలో రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా వాయిదా పడిన తర్వాత ఎక్స్ట్రా బడ్జెట్, రీ షూట్, గ్రాఫిక్స్ వర్క్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె నటించిన తాజా చిత్రం ‘భేడియా’ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆదిపురుష్ సినిమా వాయిదా మరియు టీజర్ గురించి స్పందించింది కృతి. ఆదిపురుష్ సినిమా చేసినందుకు తామంత గర్వంగా ఫీల్ అవుతున్నామని.. రామాయణం గ్లోబల్ స్థాయిలో రీచ్ అయ్యే విధంగా భారీగా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చింది.
అలాగే కేవలం ఒక నిమిషం 46 సెకన్ల టీజర్‌తోనే సినిమా మొత్తాన్ని అంచనా వేయకూడదని.. ఓం రౌత్ ఈ సినిమాను గ్రాండ్ విజువల్స్‌తో పవర్ ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడని.. ఇప్పుడు కూడా ఇంకా బెటర్‌గా చూపించడం కోసమే వర్క్ చేస్తున్నారని’ తెలిపింది. ఫైనల్‌గా ప్రస్తుతం ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని చెప్పొచ్చు.