అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya), కృతిశెట్టి(Kritishetty) నటించిన కస్టడీ చిత్రం(Custody Movie) నుంచి లిరికల్ సాంగ్(Lyrical song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. వెంకట్ ప్రభు(Venkat Prabhu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మే 12వ తేదిన ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ మూవీ(Custody Movie)ని రూపొందిస్తున్నారు.
తాజాగా కస్టడీ సినిమా(Custody Movie) నుంచి విడుదల చేసిన ‘టైమ్ లెస్’ లవ్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) ఈ సినిమాకు మ్యూజిక్(Music) అందిస్తున్నారు. రిలీజ్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి(Ramajogayya sastry) సాహిత్యం అందించారు. ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా(Yuvan shankar raja), కపిల్ కపిలన్ ఈ సాంగ్ ను పాడారు.
కస్టడీ సినిమా(Custody Movie)లో సీనియర్ హీరో అరవింద్ స్వామి, ప్రియమణి(Priyamani), శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరేన్, వెన్నెల కిశోర్ వంటివారు కీలక పాత్ర పోషిస్తున్నారు. టైమ్ లెస్ లవ్ సాంగ్ నాగచైతన్య(Nagachaitanya), కృతిశెట్టి మధ్య సాగుతుంది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.