TG: రాష్ట్రంలో ఇవాళ ‘ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ అనే భారీ కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఇవాళ్టి నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం 10 ప్రత్యేక థీమ్‌లతో పక్కా కార్యాచరణను రూపొందించింది.