ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో నూతన MPDOగా సామికొమ్ము సత్యం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు తాళ్లూరు సూపరిడెంటెంట్గా విధులు నిర్వహిస్తున్న సత్యంను పదోన్నతిపై కొమరోలు ఎంపీడీవోగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో చెన్నారావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.