KMM: కల్లూరు మండలం పెద్ద కోరుకోండి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తీసుకొచ్చిన ఇసుక ట్రాక్టర్ను శుక్రవారం తెల్లవారుజామున సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.హరిత తెలిపారు. ఆంధ్రాలో తక్కువ రేటు పలుకుతుందని అక్రమంగా తెలంగాణలోకి వచ్చి ఇసుకను అమ్ముతున్నారని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.