ASF: విద్యాశాఖలో మండల స్థాయి అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ DEO దీపక్ తివారి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల వారీగా మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేసి నిర్ణీత నమూనాలో సమర్పించాలన్నారు.