కృష్ణా: శాసనసభ ఏపీఎల్ఏ ఎస్సీ సంక్షేమ కమిటీ ఛైర్మనుగా నియమితులైన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అసెంబ్లీ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడును, ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై వారితో చర్చించారు.