టాలీవుడ్ (Tollywood)లోకి నిత్యం ఎంతోమంది హీరోలు వస్తున్నారు. కొందరు మాత్రమే నిలదొక్కుకుని తమదైన ముద్రవేస్తున్నారు. మరికొందరు అరంగేట్రానికి ముందే అరే బలే ఉన్నాడే అనిపించుకుంటారు. అలాంటి టాక్ తోనే అతి త్వరలో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. షార్ప్, స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తోన్న ఆ కుర్రాడు రోహిత్ కోల(Rohith Kola). ఆల్రెడీ నటనలో ఆరితేరి ఉన్నాడు రోహిత్. యాక్టింగ్ కు సంబంధించి ది బెస్ట్ స్టేజ్ గా చెప్పుకునే థియేటర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు రోహిత్. అతి త్వరలోనే అతను నటించబోయే ఫస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతోంది. మరి యంగ్ హ్యాండ్సమ్ టాలెంటెడ్ కుర్రాడికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం.