కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ వృద్ధ జంట వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం-2007’ అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. దాని ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి ఆస్తులను వినియోగించే హక్కు పిల్లలకు ఉండదని వెల్లడించింది.