NTR: గంపలగూడెం మండలం పెనుగొలనులోని శ్రీ గంగాపార్వతి సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో 4వ రోజు గురువారం శ్రీ పార్వతీ దేవి శ్రీ కాత్యాయిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు గణపతి పూజ, రుద్రాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.