MDK: నర్సాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ, ఇతర రైతులకు 40% రాయితీతో ఈ పరికరాలు లభిస్తాయి. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.