లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. రికవరీ ఏజెంట్ల వల్ల అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అవసరానికి అప్పు చేస్తున్నారు. బ్యాంకులు(Banks), ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు(Loans) తీసుకుంటూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల(Financial Problems) నుంచి తమను తాము కాపాడుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి ఈ రుణాలను తిరిగి చెల్లించేందుకు కాస్త ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. ఈఎంఐలు(EMIs) చెల్లించేని పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల బ్యాంకుల నుంచి ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్(Phone Calls) పదే పదే వస్తూ ఉంటాయి. అప్పు తీసుకున్న వారికి ఈ లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి తిప్పలు ఎదురవుతుంటాయి.
లోన్ రికవరీ ఏజెంట్లు(Loan Recovery Agents) తరచూ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను కూడా అవమానిస్తుంటారు. బెదిరిస్తూ మానసికంగా వేధిస్తుంటారు. డబ్బులు తిరిగి పొందేందుకు ఇలాంటివెన్నో చేస్తూ వేధింపుల(Harassments)కు పాల్పడుతుంటారు. ఏజెంట్ల(Agents) నుంచి అవమానాలు భరించలేక చాలా మంది ఆత్మహత్య(Suicide) చేసుకుంటుంటారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొన్ని కఠినమైన మార్గదర్శకాలను పాటించాలని లోన్ రికవరీ ఏజెంట్లకు సూచించింది. ఆర్బీఐ సూచన ప్రకారం ఏజెంట్లు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఫోన్లలో మాట్లాడాలి. అవమానకర సందేశాలను పంపి లోన్ తీసుకున్నవారిని శారీరకంగా, మానసికంగా వేధించకూడదని తెలిపింది.
ఏజెంట్ల(Loan Recovery Agents) నుంచి వేధింపులు ఎక్కువైతే వారికి వ్యతిరేకగా ఫిర్యాదు చేయొచ్చు. ఇది కస్టమర్ల హక్కు. రికవరీ ఏజెంట్లు పంపే మెస్సేజులు, కాల్ రికార్డింగులను భద్రపరిస్తే ఫిర్యాదు చేయడానికి సహాయపడతాయి. ఆ ఆధారాలతో లోన్ ఆఫీసర్ లేదా బ్యాంకులల్లో ఫిర్యాదులు చేయవచ్చు. అప్పుడు బ్యాంకు రికవరీ ఏజెంటుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసు స్టేషన్ కు వెళ్లి కూడా రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్ ఇవ్వొచ్చు. వారి నుంచి సాయం అందకపోతే కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయొచ్చు.
రికవరీ ఏజెంటు(Loan Recovery Agents) రుణ గ్రహీత పరువు తీయడం, వారిని అవమాన పరచడం, మానసికంగా వేధించడం వంటివి చేస్తుంటే వారిపై పరువు నష్టం కేసును వేయొచ్చు. ఇన్ని చేసినా వేధింపుల(Harassments) నుంచి ఉపశమనం లభించకపోతే ఆర్బీఐను ఆశ్రయించవచ్చు. రికవరీ ఏజెంట్ల చర్యలకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలదే బాధ్యత కాబట్టి వారే సమస్యను పరిష్కరించగలగాలి. లేకుంటే శిక్షార్హులు అవుతారు.