ADB: జిల్లాలో గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. అంతకుముందు ఆకాశం నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. జిల్లాలో కురుస్తున్న ఆకాల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.