MBNR: అక్టోబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ దిశగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారన్నారు.