నిద్రను పట్టించుకోకుండా మీ జీవితాన్ని ఉన్నతంగా నిర్మించుకోవాలని ప్రయత్నించడం ఓ చేతిని వెనక్కు కట్టేసుకుని యుద్ధం చేయడం వంటిది. నిద్రలేమి మీలో ప్రేరణలను హరించేస్తుంది. మీ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. జంక్‌ఫుడ్ పట్ల ఆకర్షింపజేస్తుంది. చిన్నచిన్న సమస్యలను భావోద్వేగ సంక్షోభాలుగా మారుస్తుంది. చాలినంత నిద్రతో చక్కని జీవితాన్ని మలచుకో.