ప్రకాశం: ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లో మున్సిపాలిటీలపై సమీక్షించారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న సంవత్సరాల్లో ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా రూ. 100 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయాలన్నారు.