»Five People Arrested In Sanath Nagar Boy Murder Case
Sanath Nagar: బాలుడి హత్య కేసులో ట్విస్ట్.. ఐదుగురి అరెస్ట్, నర బలి కాదు
హైదరాబాద్ సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో ట్విస్ట్ ఎదురైంది. అయితే అసలు బాలుడిని హిజ్రానే చంపేశాడని తేలింది. కానీ అసలు కారణం మాత్రం అమావాస్య కాదు. ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాలుడిని హిజ్రా ఎత్తుకెళ్లి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. అయితే బాలుడి కిడ్నాప్‌కు హిజ్రాకు మరో నలుగురు వ్యక్తులు సహకరించినట్లు తెలిసింది. అయితే అసలు బాలుడిని ఎందుకు అంతా కిరాతకంగా చంపాడని ఆరా తీస్తే.. బాలుడి తండ్రి, హిజ్రా మధ్య చిట్టీ డబ్బుల విషయంలో గొడవలు ఉన్నట్లు తెలిసింది.
సనత్‌నగర్(sanath nagar)లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపుతోంది. నిన్న అమావాస్య రోజు కావడంతో బాలుడిని బలి ఇచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
అంతేకాదు అదే ప్రాంతంలో నివసిస్తున్న హిజ్రా నరబలి ఇచ్చాడని ఆరోపిస్తూ బాలుడి బంధువులు, స్థానికులు అతని ఇంటిపై దాడి కూడా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకున్నారు.
నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రులు(parents) పరిసర ప్రాంతాల్లో వెతికే సరికి రాత్రి 8.30 గంటల సమయంలో జింకలవాడ నాలాలో ఓ మృత దేహాన్ని గుర్తించారు.
ఇది కూడా చూడండి:Big theft: టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ…కిలోకు పైగా గోల్డ్, డైమండ్స్ ఖతం