రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10.91 లక్షల మంది గ్రూప్ సీ, డీ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు మొత్తం రూ.1865.68 కోట్లు వెచ్చించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడంలో రైల్వే ఉద్యోగుల కృషిని గుర్తించామని కేంద్ర మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.