కృష్ణా: మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం సాధ్యమని ఎంపీపీ రావి దుర్గావాణి అన్నారు. బుధవారం మోపిదేవి మండలం పెద్దప్రోలులో ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్’ కార్యక్రమం జరిగింది. డాక్టర్ నంబూరు శ్రీరామ్ సాయి కార్యక్రమంపై అవగాహన కలిగించారు. సర్పంచ్ ఏసుబాబు, పీఏసీఎస్ ఛైర్మన్ శరత్ చంద్రబాబు, ఎంపీడీఓ స్వర్ణభారతి, హెల్త్ సూపర్వైజర్ తోట సుధాకర్ పాల్గొన్నారు.