SRPT: డ్రగ్స్ గంజాయి, సైబర్ మోసాల నిర్మూలన మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బుధవారం సూర్యాపేట శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు పట్టణ పోలీసు, షి టీమ్స్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ నరసింహ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.