VSP: హాకర్స్ జోన్ ఏర్పాటు చేసే వరకు వ్యాపారాలు కొనసాగించేందుకు అనుమతించాలని ఏఐటీయూసీ శుక్రవారం డిమాండ్ చేసింది. జోన్-8 కార్యాలయం నుంచి చిరువ్యాపారులు ర్యాలీగా బయలుదేరి 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. జీవీఎంసీ నోటీసు లేకుండా కౌంటర్లు ధ్వంసం చేయడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.