AP: మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే, మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు.