కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి (సైన్స్ గ్రూప్) ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు తేదీ పొడిగించినట్లు ప్రిన్సిపల్ డి. యదునందన తెలిపారు. ఈనెల 23తో గడువు ముగియగా తాజాగా అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. అభ్యర్థులు cbseitms.rcil.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.