SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సూది కొండ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురి అయిన, శేఖర్ (37) అనే కార్మికుడు మంగళవారం మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేపడుతుండగా కరెంట్ షాక్కు గురవ్వడంతో అతను మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. దీని పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.