HYD: మైలార్ దేవ్పల్లి పీఎస్ పరిధిలో పాత టైర్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.