MDK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించారు.