కడప: జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.