KA Paulతో జేడీ కలువడంపై వర్మ షాక్, ఏఐ పిక్ అనుకున్నానని ట్వీట్
కేఏ పాల్‌తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.
Ram gopal varma:సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Laxminarayana)- ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (ka paul) నిన్న ప్రెస్మీట్లో కనిపించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇద్దరూ మాట్లాడారు. సీరియస్‌గా ఉండే జేడీ.. కమెడీయన్ కేఏ పాల్ మీట్ అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే అంశంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) స్పందించారు.
‘ఎప్పుడూ సీరియస్‌గా ఉండే జేడీ లక్ష్మీనారాయణ (jd).. కమెడీ పీస్ కేఏ పాల్‌తో (ka paul) భేటీ అయ్యారని తెలిసి షాక్ అయ్యా. తొలుత ఇదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జనరేట్ చేసిన ఫోటో అనుకున్నా. ఆ తర్వాత వీడియో (Video) చూసి నిజమే అని నిర్ధారణకు వచ్చా. ఇదీ జోక్.. ఫన్నీ మాత్రం కాదు అని’ రాంగోపాల్ వర్మ (Ram gopal varma) ట్వీట్ చేశారు.
వర్మ (varma) ట్వీట్‌కు కొందరు స్పందింన్నారు. ఓ యూజర్ అయితే కేఏ పాల్‌ను (ka paul) అలా నిందించడం సరికాదని స్పందించాడు. మరో వ్యక్తి ఏమో.. తనకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇష్టం.. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా (assistan director) పనిచేయాలి అనుకుంటున్నా అని కామెంట్ చేశారు.
SHOCKED to see the ULTRA SERIOUS JD garu sitting next to the MEGA COMEDIAN K A PAUL ..This JOKE is NOT FUNNY..I thought it was a deep fake AI generated pic till I saw the video 😳😳😳 pic.twitter.com/rNWkb3uuYD
కేఏ పాల్‌కు (ka paul) చాలా మంది తెలుసు.. ఆయన వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగబోదు అని జేడీ లక్ష్మీనారాయణ (jd) అన్నారు. అందుకే అతనితో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నా అని వివరించారు. ఉక్కు కోసం బిడ్డు వేసిన లక్ష్మీనారాయణ (laxmi narayana) చిత్తశుద్ది నచ్చిందని కేఏ పాల్ (ka paul) పొగడ్తలు కురిపించారు. ఇలా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. పనిలో పనిగా కేఏ పాల్ (ka paul).. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (cm kcr) విరుచుకుపడ్డారు.