ప్రకాశం: సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కనిగిరి జడ్జి బి. రూపశ్రీ స్పష్టం చేశారు. గురువారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన హెల్ప్ లైన్ నంబర్ల ప్రచార గోడ పత్రికను కోర్టు ఆవరణలో జడ్జి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో వివాహం పిల్లల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.