KMM: చమురు, డాలర్ ఆధిపత్యం కోసమే అగ్రరాజ్యాలు అరాచకం సృష్టిస్తున్నాయని CPIML మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు రాకేష్ అన్నారు. ఇరాన్ పై అమెరికా దాడిని ఖండిస్తూ గురువారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కామేపల్లి (మం) పండితాపురంలో నిరసన తెలిపారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారతదేశం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.