TG: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమించింది. పొన్నం ప్రభాకర్‌తో పాటు కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేష్ గుండు రావును కూడా ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.