W.G: పెంటపాడు (M) అలంపురం గ్రామానికి గురువారం సీపీఎం ప్రజా చైతన్య యాత్ర చేరుకుంది. సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. కాలువలు, చెరువులు పరిశ్రమల కాలుష్యంతో నిండిపోతున్నాయని, ప్రజలు క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు తాగే ఆర్వో నీటిని ప్రజలకు ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.