బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ నుంచి హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో…. వారిద్దరూ హస్తినకు వెళ్లడం గమనార్హం. హై కమాండ్ పెద్దలను కలుసుకునేందుకు అక్కడే మకాం వేశారు. ఈ ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ టూర్ వెళ్లడం వెనక కారణాలు ఏమిటి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడానికి హై కమాండ్ పిలిపే కారణం గా తెలుస్తోంది. వీరిద్దరూ అమిత్ షా పిలుపు మేరకే ఢిల్లీ వెళ్లారని సమాచారం.
తెలంగాణ బిజెపిలో చాలామంది కీలక నాయకులే ఉన్నా రాజేందర్, రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ఢిల్లీ పెద్దలు ఆహ్వానించారు. వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక అంశాల గురించి చర్చించబోతున్నట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి ఓటమిపాలయినప్పటికీ బీజేపీకి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 96,598 ఓట్లు రాగా… కోమటిరెడ్డికి 86,485 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. అయితే వీరికి కీలక పదవులను అప్పగించేందుకే బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచినట్టు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.